Fri. Jan 30th, 2026

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ నందు మాజీ మంత్రి సంభానీ చంద్రశేఖర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన కొత్తగూడెం నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షులు రాయల శాంతయ్య. ఈ కార్యక్రమములో ముందుగా నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసిన శాంతయ్య.అనంతరం హాస్పిటల్ లో రోగులకు పండ్లు,బ్రెడ్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంభానీ చంద్రశేఖర్ మంచికి మారు పేరు,నీతి నిజాయితీ పరుడు,నిస్వార్థ పరుడు,స్నేహశీలి,మృదుస్వభావి, రాజకీయ దురంధరుడు,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే అనేక కీలక మంత్రి పదవులు చెసి ఉమ్మడిరాష్ట్రాలకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత సంభానీ కి దక్కాయి అదే విధంగా తను యం.ఎల్.ఏ గా సుమారు ఐదు పర్యాయాలు చేసి నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడిపించిన ఘనత కూడా ఆయనదే కార్యకర్తలకు ఎల్లా వేళలా అందుబాటులో ఉండేవారు వారికి ఏ కష్టం వచ్చిన వెంటనే వారి ముందు ఉండే నైజాం తనది,అదే విధంగా నాయకులకు భరోసా ఇస్తూ నడిపించే వారు,సంభానీ చంద్రశేఖర్ ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని,ఆ భగవంతున్ని కోరుకుంటున్నానీ శాంతయ్య తెలిపారు.ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడు పల్లపు వెంకటేశ్వర్లు, ముద్ధంగుల రామకృష్ణ,పల్లపు బాలరాజు,మహ్మద్ ఇఫ్తకర్,సంతోష్,రాకేష్, మధు,వంశిక్రిష్ణ,సతీష్,కోటేశ్,పండు, గణేష్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Share this post...