
కొత్తగూడెం : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యంత పేరుగాంచిన కొత్తగూడెం క్లబ్ సెక్రెటరీగా కోనేరు పూర్ణచంద్రరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.శుక్రవారం కొత్తగూడెం క్లబ్ పాలకమండలి నిర్వహించిన సమావేశంలో కోనేరును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మాజీ మంత్రి,ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని వర్గాల ప్రజలకు ఆప్తుడుగా ఉన్న స్వర్గీయ కోనేరు నాగేశ్వరావు ప్రముఖ పారిశ్రామికవేత్త నవభారత్ యజమాని సహకారంతో కొత్తగూడెం క్లబ్బును నిర్మింపజేయడం జరిగింది.కొత్తగూడెం ప్రాంతంలో రాజకీయ పార్టీల సమావేశాలతో పాటు,అన్ని వర్గాల ప్రజలకు వివాహ వేడుకలకు అందుబాటులో ఉండేది. కొత్తగూడెం క్లబ్ కు తొలుత నాగేశ్వరావు అన్ని తానై నిర్వహించడం జరిగింది. కాలక్రమేణ కొత్తగూడెం క్లబ్ కు అధ్యక్షులుగా కొత్తగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎవరు ఉన్నప్పటికీ సదరు అధికారి అధ్యక్షులుగా కొనసాగుతూ వచ్చారు.చాలాకాలం ఈ క్లబ్బుకు డాక్టర్ రమేష్ బాబు సెక్రెటరీగా కొనసాగారు.అనివార్య కారణాల కారణంగా డాక్టర్ రమేష్ బాబు క్లబ్ సెక్రటరీ పదవికి రాజీనామా చేయడంతో నూతన సెక్రటరీగా కోనేరు పూర్ణచంద్రరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.కోనేరు పూర్ణ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల రాజకీయ వ్యాపార వర్గాలతోపాటు రాజకీయాలకు అతీతంగా ఉన్న ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు*
