Thu. Jan 29th, 2026

హరిత దీక్ష, గ్రీన్ మోటార్ వెహికల్ గార్డెన్, వ్యవస్థాపకులు కొత్తగూడెం సింగరేణి వర్క్ షాప్ కార్మికుడు నూర్వీ రాజశేఖర్ ప్రకృతి హరిత దీక్ష సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం మన్ కీ బాత్ కార్యక్రమానికి ఆయనను ఆహ్వానించింది.ప్రధాని నరేంద్ర మోది శ్రీకారం చుట్టిన మన్ కి బాత్ కార్యక్రమం 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛందంగా వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న వారిని గుర్తించి,మన్ కీ బాత్ కార్యక్రమంలో వారి గురించి ప్రశంసించి అభినందనలు తెలిపి వారికి ఢిల్లీలో జరిగే కర్తవ్య పద్,రిపబ్లిక్ డే వేడుకు భారత ప్రభుత్వం ఆహ్వానం పంపించింది.ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్ టీబీజీకేఎస్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు,కాంగ్రెస్ నాయకులు ఆకునూరి కనకరాజు,కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసీ సీనియర్ నాయకులు ఎస్కే గౌస్,మొక్కల వెంకటయ్యలు, టి.శ్రీనివాస్, మొహమ్మద్ ముస్తఫా,భాషిత్, శివప్రసాద్, బి కృష్ణా అనిల్, నజీర్,వెంకటరమణ,జాకీర్,బాలు నాయక్ తదితరులు అభినందనలు తెలియజేశారు.

Share this post...