జిల్లా గౌరవ అధ్యక్షుడు గుగులోత్ మోహన్ లాల్ అద్యక్షతన లక్ష్మీదేవి పల్లి మండలం మైలారం జిల్లా పరిషత్ పాఠశాలలో టీజీ టి టి ఎఫ్ సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో టి జి టి టి ఎఫ్ లక్ష్మీ దేవి పల్లి మండల నూతన కమిటీనీ ఎన్నుకున్నారు.మండల అధ్యక్షుడిగా భూక్యా కబీర్, ప్రధాన కార్యదర్శి గా భూక్యా లక్ష్మణ్ గార్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో శంకర్, వి రమేశ్ బాబు,బానోతు భిక్య,లక్పతి లాల్,మోహన్ లాల్, సుందర్, రమేశ్, బిచ్చ, శంకర్, రామ్ చందర్ తదితరులు పాల్గొన్నారు
