చుంచుపల్లి మండలం బంజార హిల్స్ లో టీజీ టిటిఎఫ్ ఉపాధ్యాయ సంఘం సమావేశం వాంకుడోత్. రమేష్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో చుంచుపల్లి మండల అధ్యక్షులుగా బుచ్చులాల్ ప్రధాన కార్యదర్శిగా రామును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమానికి ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ… పెండింగ్ లో ఉన్న డి ఎ లను విడుదల చేయాలని,పీఆర్సీ ని వెంటనే ప్రకటించాలనీ డిమాండ్ చేశారు.అదేవిధంగా జి ఓ నెంబర్ 3 కోసం కృషి చేస్తున్నామని, జిల్లాను యూనిట్ గా తీసుకొని ప్రమోషన్ ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వీరన్న,వర్కింగ్ ప్రెసిడెంట్ ఇ.బిచ్చా,కె.బిచ్చ,బాదావర్ రాంకుమార్, మోహన్ లాల్,లోకేష్,బాలు,రాంచందర్,కృష్ణ వెంకట్,భద్రు, రాంసింగ్,రమేష్,నరసింహరావు,మాన్సింగ్,చంద్రు,రాము,రాంజి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
