
సింగరేణి మండల కేంద్రంలో ఫిబ్రవరి 15వ తారీకున జరుగు సంత్ శ్రీ శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి 286వ జయంతి ఉత్సవాలు మరియు భారీ భోగ్ బండారో కార్యక్రమం నిర్వహించుటకు ఆదివారం కారేపల్లిలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 15వ తేదీన జరుగు సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో RTI మాజీ కమిషనర్ శంకర్ నాయక్, LIVE ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ బాలు నాయక్,లంబాడి సంస్కృతి పరిరక్షణ వ్యవస్థాపక అధ్యక్షులు భూక్యా రాంకోటి,గౌరవ అధ్యక్షులు రాములు నాయక్, ఇస్లావత్ రత్న, వాంకుడోత్ సక్రు నాయక్, బానోత్ శంకర్, TGTTF సింగరేణి మండల అధ్యక్షులు అజ్మీర వీరు నాయక్,LHPS మండల అధ్యక్షులు ఆంగోత్ రవి నాయక్, అజ్మీరా నగేష్ తదితరులు పాల్గొన్నారు.
