
బంజారా జాతి ఆరాధ్య దైవమైన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జాతిని ఒకే తాటిపై నడిపించిన మహనీయుడనీ.. సేవాలాల్ మహారాజ్ అడుగుజాడలో నడిచి ఆయన ఆశయ సాధనం కోసం ప్రతి బంజార బిడ్డ కృషి చేయాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.శనివారం స్థానిక లక్ష్మీదేవిపల్లి కార్తీక వనంలో డిసిహెచ్ఎస్ డా.రవి బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286 వ జయంతి సందర్భంగా భోగ్ బండారో కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…ఒక సంఘసంస్కర్త, ప్రకృతి ప్రేమికుడు ఆధ్యాత్మిక గురువు,బంజారాల సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షకుడు,జాతి ఉద్దారకుడు శ్రీ సంత్ సేవలాల్ మహా గురువని కలెక్టర్ కొనియాడారు.బంజారా జాతిని చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చిన ఒక విప్లవ చైతన్య మూర్తి సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలో మనమందరం పయనించి ఆయన ఆశయాలను కొనసాగించాలని డిసిహెచ్ఎస్ డా.రవిబాబు కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా,వైద్యశాఖ అధికారి భాస్కర్ నాయక్, డిసిహెచ్ఎస్ రవిబాబు, జిజి హెచ్ ఆర్ ఎం ఓ రమేష్, బంజారా వైద్య బృందం మరియు వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.
