Wed. Mar 25th, 2026

 

J365 NEWS,పాలకవీడు:    సమాచార హక్కు చట్టం ఆక్టీవిస్ట్స్ ఫోరమ్ సూర్యాపేట జిల్లా హుజుర్నగర్ నియోజకవర్గం అధ్యక్షులు గా పాలకవీడు మండలం బెట్టే తండ గ్రామానికి చెందిన ధీరావత్ శివ నాయక్ నియమితులయ్యారు. జిల్లా అధ్యక్షులు రామక్రిష్ణ,ప్రధాన కార్యదర్శి జానకి రాములు సూచనల మేరకు శుక్రవారం రాష్ట్ర అధ్యక్షులు బత్తుల గణేష్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సందర్భంగా నూతనంగా నియమితులైయిన శివ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులను సమన్వయం చేసుకుంటూ జిల్లాలో సమాచార హక్కు చట్టం పకడ్బందీగా అమలుకు కృషి చేస్తానని, ఆర్టీఐ పై అవగాహన కార్యక్రమాలు చేపడతానని, సొసైటీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. సహా చట్టం విషయంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. సహ చట్టం ద్వారానే ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత, జవాబుదారితనం సాధ్యమన్నారు. తన పైన ఉన్న నమ్మకంతో తనకు బాధ్యతను అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు మరియు జిల్లా కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు.

Share this post...