కొత్తగూడెం పట్టణంలో గల కూలీ లైన్ హైస్కూల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో హెడ్ మాస్టర్ రవీందర్ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ తెలిపారు.కరాటే శిక్షణకు పాఠశాలకు రూ.30 వేలు మంజూరయ్యాయి. కరాటే శిక్షకుడికి ఇవ్వాల్సిన రూ.30 వేలల్లో రూ.20 వేలు లంచం డిమాండ్ చేయగా,బాధితుడి ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు.
