Wed. Mar 25th, 2026

గిరిజన బాలబాలికలు జీవితంలో అత్యున్నత స్థానంలో నిలవడానికి మనసులో అనుకున్న గోల్ సాధించడానికి ఇప్పటి నుండే ప్రణాళికలు రూపొందించుకొని తాను సాధించి జీవితంలో స్థిరపడ డానికే ప్రేరణ కెరిర్ గైడెన్స్ ద్వారా అవగాహన పెంపొందించుకోవడానికి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ అన్నారు.మంగళవారం నాడు పాల్వంచ మండలంలోని ఉలవనూరు ఏ జి హెచ్ ఎస్ బాలికల ఆశ్రమ పాఠశాలలో 8, 9, 10 వ తరగతి చదువుతున్న విద్యార్థినిలకు వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన కెరిర్ గైడెన్స్ అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థినిలే కాక 8వ,9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థిని,విద్యార్థులు పదో తరగతి అయిపోయిన తర్వాత భవిష్యత్తులో ఏ రంగంలో స్థిరపడాలని అనుకుంటున్నారో, ఇప్పటి నుండే కెరీర్ గైడెన్స్ పై అవగాహన కల్పించే ఉద్దేశంతో విద్యా ఉద్యోగ సమాచారం పిల్లలందరూ తెలుసుకునే విధంగా పాఠశాలల్లో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. సంబంధిత ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు బాలబాలికల్లో అంతర్గతంగా దాగి ఉన్న టాలెంట్ ను గుర్తించి, వారు ఏ రంగంలో స్థిరపడాలని అనుకుంటున్నారో సలహాలు సూచనలు ఇవ్వాలని, ప్రతిరోజు విద్యార్థినిలు పాఠశాలల్లో పెట్టిన చార్టులు చదివి వాటిలోని సారాంశాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోని అన్నారు.ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో ఏమి అవ్వాలో ఇప్పటినుంచే ప్రణాళికల రూపొందించుకుని ముందుకు పోవాలని అన్నారు. ఉత్తమ సాధన ద్వారా తమ లక్ష్యాలను చేరుకోవచ్చునని స్పెషల్ ఆఫీసర్ డి.ఇ మధుకర్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఐటీడీఏ డి .ఈ మరియు స్పెషల్ ఆఫీసర్ మధుకర్, తాహసిల్దారు వివేక్, ఎంపీడీవో విజయ్ భాస్కర్ రెడ్డి, ఎ ఎస్ ఓ వెంకటేశ్వర్లు,ఎంఈఓ శ్రీరామమూర్తి, అగ్రికల్చర్ ఆఫీసర్ శంభో శంకర్, మెడికల్ ఆఫీసర్ తేజశ్రీ, డి ఈ ఈ రాణీ, ఎస్సై సురేష్, ఏ ఈ యశ్వంత్, సుధ, మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని, ఎ.జి.హెచ్.ఎస్ ఉల్వనూరు ఉపాద్యాయని ఉపాద్యాయులు మరియు ఇతర శాఖల సిబ్బంది విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Share this post...