Tue. Mar 24th, 2026

కొత్తగూడెంలోని సిఐటియు కార్యాలయంలో సోమవారం రాసూరు శంకర్ అధ్యక్షతన సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల సంయుక్త సమావేశం జరిగింది.ఈ సమావేశంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపుదల కోసం కాంట్రాక్ట్ కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా జేఏసీగా ఏర్పడి కృషి చేయాలని నిర్ణయించాయి. కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపుదల,వైద్య సదుపాయం, ఉద్యోగ భద్రత,తదితర డిమాండ్ల సాధన కోసం అసెంబ్లీ సమావేశాల్లోపుగా ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ తెలంగాణ జన సమితి అధ్యక్షులు సహకారంతో సింగరేణి యాజమాన్యాన్ని, ఇందన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మరియు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డినీ కలిసి వాటి పరిష్కారం కోసం కృషి చేయాలనీ ఏకాభిప్రాయానికి రావడం జరిగింది. సమస్యల పరిష్కారం కానట్లయితే మార్చి 25న ప్రజా భవన్ లో సామూహిక రాయబార కార్యక్రమాన్ని నిర్వహించాలని జేఏసీ నిర్ణయించింది. ఈ సమావేశంలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు,టి యు సి ఐ రాష్ట్ర నాయకులు యాకూబ్ శావలి, IFTU రాష్ట్ర నాయకులు ఎన్ సంజీవ్,తెలంగాణ జన సమితి కార్మిక సమైక్య రాష్ట్ర కన్వీనర్ మల్లెలరామనాథం, కో కన్వీనర్ వరదబోయన బాబు, ఐ ఎన్ టి సి రాష్ట్ర నాయకులు ఆల్బర్ట్, హెచ్ఎంఎస్ రాష్ట్ర నాయకులు గడిపల్లి కృష్ణ ప్రసాద్, సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు భూక్యా రమేష్,ఐ ఎఫ్ టీ యు రాష్ట్ర నాయకులు కందగట్ల సురేందర్, కాంట్రాక్టు కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం నాయకులు రవి తదితరులు పాల్గొన్నారు.

Share this post...