
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పది సంవత్సరాల కెసిఆర్ పాలనలో దగాపడ్డ తెలంగాణ యువత,నిరుద్యోగ యువతకు చేయూత నివ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సంవత్సరకాలంలోనే 65 వేల ప్రభుత్వ ఉద్యోగాలకు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 65 వేల మంది యువత ఉద్యోగ నియామక పత్రాన్ని అందుకోవడం జరిగిందని ఇది దేశ చరిత్రలో ఏ రాష్ట్రం చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించడం జరలేదని మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజపాలనలో మాత్రమే జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవీలాల్ నాయక్ తెలిపారు. అదేవిధంగా రాజీవ్ యువ వికాసం పధకాన్ని ఎస్సి,ఎస్టీ, బీసీ,మైనారిటీకి చెందిన నిరుద్యోగ యువతకు చేయూతనివ్వాలని వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 6 వేల కోట్ల రూపాయలను కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేసారు. అదే విధంగా రాబోయే రోజుల్లో 57,946 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టనుంది.200 ఎకరాల్లో అర్టిఫిషల్ ఇంటలిజెన్స్ సిటీ నిర్మించాబోతుందని భవన నిర్మాణం రంగంలో విద్యార్థులకు ప్రత్యేక కోర్సులు ప్రవేశ పెట్టడం అభినందనీయమని పత్రిక విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.
