Tue. Mar 24th, 2026

జిహెచ్ఎస్ బాబు క్యాంప్ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న ఎంపీ యుపిఎస్ పెనుబల్లి పాఠశాలకు చుంచుపల్లి మండల ఉత్తమ పాఠశాల అవార్డు శ్రీ గౌరవ భద్రాద్రి కలెక్టర్ నితీష్ వి పాటిల్ గారి చేతుల మీద స్వీకరించడం జరిగింది ఎఫ్ ఎల్ ఎన్ బాలమేల ముగింపు కార్యక్రమం జడ్పీహెచ్ఎస్ ఆనంద ఖని స్కూల్లో జరిగిన కార్యక్రమంలో పాఠశాల అహ్లాదకరమైన వాతావరణం,పరిసరాలు పరిశుభ్రత, మొక్కల పెంపకం,విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధి వంటి అంశాలను బాబు క్యాంప్ హెచ్ఎం నీరజ,మండల ఎంఈఓ బాలాజీ పరిశీలించి,మండల ఉత్తమ పాఠశాలగా ఎంపిక చేశారు.అందుకుగాను నిన్న జరిగిన బాలమేళా ముగింపు కార్యక్రమంలో ఎంపియుపిఎస్ పెనుబల్లి పాఠశాల హెచ్ఎం కే నిర్మల మరియు పాఠశాల సిబ్బంది అయినా ఎం రాజయ్య,శారద,హరిలాల్ విజయ,సుజాత వీరందరిని స్టేజి పైన ఆహ్వానించి శాలువాతో సన్మానించి, మెమొంటో కలెక్టర్  అందించడం జరిగింది.మా పాఠశాల ఉపాధ్యాయ సిబ్బందిని గౌరవ డి ఈ ఓ వెంకటాచారి గారు మరియు ఏ ఎం ఓ నాగరాజు శేఖర్,,ఎంఈఓ బాలాజీ, కాంప్లెక్స్ హెచ్ఎం నీరజ  అభినందనలు తెలిపారు

Share this post...