
ఇటుక బట్టీల కార్మికుల మధ్య ఈటల జన్మదిన వేడుకలు. ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ సేవలు తరం తరం నిరంతరం,ప్రజల ఆదరణ అభిమానం పొందిన ప్రజా నాయకుడని లక్ష్మీదేవిపల్లి బిజెపి మండల అధ్యక్షుడు మాలోత్ గాంధీ నాయక్ పేర్కొన్నారు.మల్కాజ్గిరి ఎంపీ బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ జన్మదినం సందర్భంగా గురువారం లక్ష్మీదేవిపల్లి మండలం కారకొండ గ్రామ పంచాయతీ పరిధిలోని జూబ్లీ పురం సమీపంలో ఉన్న ఇటుక బట్టి కార్మికులతో మాలోత్ గాంధీ నాయక్ స్థానిక నాయకల ఆద్వర్యంలో కేక్ కట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందించడం జరిగిందన్నారు. ముఖ్యంగా వైద్య ఆరోగ్యశాఖను బలోపేతం చేసినట్లు పేర్కొన్నారు. కార్పొరేట్ స్థాయిలో ఆసుపత్రులను అభివృద్ధి చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.తాజాగా ఎంపీ హోదాలో ఉండి కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో ఈటల రాజేందర్ అందిస్తున్న సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో రావుల రాము కొండలు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
