
పాల్వంచ పట్టణ పరిధిలో మైనింగ్ కాలేజ్ ఎదురుగా జాటోత్ ఠాను నాయక్ వర్ధంతి సందర్బంగా చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.జాటోతు ఠాను నాయక్ తెలంగాణ గిరిజన ఉద్యమ నాయకుడు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిష్టు పార్టీకి నాయకత్వం వహించిన యుద్ధ వీరుడుఅనీ రమేష్ రాథోడ్ పేర్కొన్నారు. భూమికోసం భుక్తికోసం వెట్టిచాకిరి విముక్తి కోసం విసునూరు దేశ్ ముఖ్ గుండాలను నిజాం రజాకార్లను ఎదురించిన ధైర్యశాలి. ధర్మాపూర్ తండా పోరు గడ్డను దాస్య శృంఖలాలు నుండి విముక్తి చేసి అమరుడైన బంజారా కొదమ సింహంఅనీ అందుకు గిరిజన జనాభా ఎక్కువ ఉన్నా ఈ ప్రాంతంలో (ఇల్లందు క్రాస్ ) ఠాను నాయక్ జంక్షన్ మార్చాలని స్థానిక ఏమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టాలనీ కోరారు.20 వ.శతాబ్దం భారత దేశ చరిత్రలో వీరత్వంలో త్యాగంలో తెలంగాణ రైతాంగ పోరాటానికి మరేదీ సాటి రాదు.ఈ ఉద్యమం. హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ ప్రాంతంలో 1941 నుండి 1951 వరకు దాదాపు పది సంవత్సరాలు వరంగల్ జిల్లాలో జనగామ తాలూకా కేంద్రంగా తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. జనగామ జమిందార్ విసునూరు రామచంద్రరెడ్డి కొడుకు బాబుదోర ఒక రోజు గుండాలతో తాండకు వచ్చి తాండ గుడిసెలను నిప్పు పెట్టి అగ్నికి ఆహుతి చేసినారు. ఠానునాయక్ అన్న సోమ్లా నాయక్ అతనితో సహా మొత్తం ఐదుగురిని గుండాల సహయంతో మండుతున్న అగ్నిలో సజీవదహనం చేసి వెళ్ళిపోయారు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ బాబుదొర తాండా ప్రజలను హింసించడం మొదలుపెట్టాడు.గుండాలతో రజాకార్లతో మధ్యాహ్నం సమయంలో తాండలో ఠానునాయక్ వదినమ్మ జాటోత్ ఫూలిబాయి అందరికి రహస్య సమాచారం ఇచ్చి తాండ వాసులను పిలపించి అందరినీ ఏకం చేసి ఆడవాళ్ళు కారం పొడితో మగవాళ్ళు వడెసరాళ్ల, వడెసతో దొరల గుండాల పై తిరుగుబాటు ప్రారంభించారు మాట్లాడుతూఅనీ కొనియాడారు.ఈ సందర్భంగా ధర్మాసోత్ ఉపేందర్ నాయక్ మాట్లాడుతూ జాటోత్ ఠానూ నాయక్ గిరిజన తెగకు చెందిన నిరక్షరాస్యుడు.చాలా తెలివి తేటలు గలవాడు. అతని తెలివి తేటలను గమనించి కమ్యూనిస్టు నాయకులు ఠాను నాయక్ కుటుంబానికి అండగా నిలిచారు. దొరలు,రజాకార్ల పెత్తనాన్ని,ధైర్యంగా ఎదిరించి పోరాడేవాడు అనీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో అనిల్ ఇస్లావత్,రామకృష్ణ మాలోత్, చందు,అర్జున్ తదితరులు పాల్గోన్నారు
