
లక్ష్మీదేవి పల్లి మండలంలో గల జెడ్పి హెచ్ ఎస్ హేమచంద్రాపురం పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 35 మంది విద్యార్థిని,విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు జామెంట్రీ కిట్ విద్యార్థులకు పరీక్షకు కావలసిన అన్ని రకాల సామాగ్రిని ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొత్తగూడెం డీఎస్పీ షేక్ అబ్దుల్ రహమాన్ చేతుల మీదుగా అందజేశారు.పదవ తరగతి పరీక్షల్లో మంచిగా రాసి రాష్ట్రానికి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని డిఎస్పీ ఆకాంక్షించారు.భావి భారత పౌరులుగా ఔన్నత్యాన్ని కాపాడాలని జీవితంలో తొలిమెట్టు ఎక్కబోతున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ ఎం శ్రీనివాస్,మరియు ఉపాధ్యాయులు పాఠశాల సిబ్బంది మరియు ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఫౌండర్ శ్రీకాంత్ లడ్డు, గౌతమ్,అర్జున్ కుమార్,చింటూ ఏషావర్,ఉదయ్ సత్యసాయి,శ్యామ్,మొయిన్,కౌశిక్,శశి,ఫ్రెండ్స్ ఫౌండేషన్ మిత్రబృందం తదితరులు పాల్గొన్నారు.
