Tue. Mar 24th, 2026

  జిహెచ్ఎస్ బాబు క్యాంప్ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న ఎంపీ యుపిఎస్ పెనుబల్లి పాఠశాలకు చుంచుపల్లి మండల ఉత్తమ పాఠశాల అవార్డు  భద్రాద్రి కలెక్టర్ నితీష్ వి పాటిల్ గారి చేతుల మీద స్వీకరించడం జరిగింది.ఎఫ్ ఎల్ ఎన్ బాలమేల ముగింపు కార్యక్రమం జడ్పీహెచ్ఎస్ ఆనంద ఖని పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాఠశాల యొక్క అహ్లాద వాతావరణం,పరిసరాలు పరిశుభ్రత,చెట్లు పెంపకం, విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధి వంటి అంశాలను బాబు క్యాంప్ హెచ్ఎం నీరజ మండల ఎంఈఓ బాలాజీ పరిశీలించి, మండల ఉత్తమ పాఠశాలగా ఎంపిక చేయడం జరిగింది.అందుకుగాను  బాలమేళా ముగింపు కార్యక్రమంలో ఎంపియుపిఎస్ పెనుబల్లి పాఠశాల హెచ్ఎం కే నిర్మల మరియు పాఠశాల సహ ఉపాధ్యాయుడు ఎం రాజయ్య,శారద,హరిలాల్ విజయ,సుజాత లను శాలువాతో సన్మానించి,మెమొంటో అందజేసిన జిల్లా కలెక్టర్ జీతేశ్ వి పాటిల్.పాఠశాల ఉపాధ్యాయ సిబ్బందిని భద్రాద్రి డిఈఓ వేంకటేశ్వర చారి  మరియు ఏ ఎం ఓ నాగరాజు శేఖర్, ఎంఈఓ బాలాజీ, కాంప్లెక్స్ హెచ్ఎం నీరజ అభినందనలు తెలిపారు.

Share this post...