Wed. Apr 16th, 2025 12:19:36 PM

పాల్వంచ : బంజారా జాతి బాషాను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లో చేర్చడానికి తెలంగాణ అసెంబ్లీ లో బిల్ ప్రవేశపెట్టి ఆమోదం పొందిన సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవీలాల్ నాయక్ ఆధ్వర్యంలో పాల్వంచ అంబేద్కర్ సెంటర్ నందు బంజారా జాతి నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా వైరా శాసనసభ్యులు రాందాస్ నాయక్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవీలాల్ నాయక్ మాట్లాడుతూ 1976 కు ముందు బంజారా జాతి డెనోటిఫెయిడ్ జాతిగా ఉందని ఆనాడు కేంద్ర,రాష్ట్రాలలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బంజారా జాతి స్థితిగతులపై అధ్యయనం చేయడానికి కమిటీనీ ఏర్పాటు చేయడం జరిగిందని ఆ కమిటీ సిఫార్సు మేరకు ఆనాడు ప్రధానమంత్రి గా ఉన్న ఇందిరా గాంధీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జలగం వెంగళ రావు నాయకత్వంలో 1976 లో బంజారా జాతిని ఎస్టీ జాబితాలో చేర్చడంతో ఇవాళ బంజారా జాతి విద్య, ఉపాధి, రాజకీయాలలో రిజర్వేషన్ పొందుతున్నారని తెలిపారు. అదేవిధంగా ఈనాడు తెలంగాణాలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బంజారా భాషా గోర్ బోలి నీ రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లో చేర్చాలని బిల్ ప్రవేశ పెట్టి ఆమోదం తెలపడం జరిగిందని కాంగ్రెస్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు బంజారా జాతి పక్షనా ఉంటదని మరోసారి నిరూపించినందుకు బంజారా జాతి హర్షం వ్యక్తం చేస్తుందని తెలిపారు.ఈ యొక్క బిల్ ఆమోదం కొరకు మాజీ ఎమ్మెల్సి రాములు నాయక్, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్,వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్,ఎమ్మెల్యే బాలు నాయక్, ప్రభుత్వ విప్ రాంచందర్ నాయక్ తెలంగాణ బంజారా జాతి తరపున ధన్యవాదములు తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బంజారాల పక్షపాతి అని బంజారా జాతి ఎప్పటికి కాంగ్రెస్ పార్టీకి ఎన్నటికీ రుణపడి ఉంటదని పార్టీ సంక్షేమం కోసం బంజారా జాతి ఎప్పటికి అండగా ఉంటదని తెలిపారు.ఈకార్యక్రమంలో భట్టు మురళి,రాము నాయక్, ఉపేందర్ నాయక్,రమేష్ నాయక్,బాలాజీ నాయక్,శంకర్, కిషన్,యోగి,నందిని,అనిల్,దేవా,బాలు నాయక్, సుమన్ నాయక్ మంజూర్,రవి గౌడ్, సోమయ్య, పెంకి శ్రీను, సాంబయ్య,నాగేశ్వరావు, విజయ్,గంధం నరసింహ రావు, బాషా,రాములు నాయక్,కుశ నాయక్,తాజుద్దీన్, తదితరులు పాల్గొన్నారు

Share this post...

You missed

What do you like about this page?

0 / 400