భద్రాద్రి జిల్లా: మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అనుచిత వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా మారిందని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కోనేరు సత్యనారాయణ అన్నారు కొత్తగూడెంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…సీఎం రేవంత్ రెడ్డి కంచె గచ్చిబౌలిలో అంతర్జాతీయ సంస్థలను ఆహ్వానించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అయితే, కొంత మంది రాజకీయ కుట్రతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.కాంగ్రెస్ పార్టీపై బురద చల్లే ప్రయత్నం చేస్తే సహించేది లేదని కోనేరు సత్యనారాయణ హెచ్చరించారు.కాంగ్రెస్ భిక్షతోనే నేడు వనమా ఈ స్థాయిలో ఉన్నారని గుర్తుచేశారు.ఈ సమావేశంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు దేవిప్రసన్న,రైల్వే బోర్డు మెంబర్ వై. శ్రీనివాస్ రెడ్డి, మండే హనుమంతరావు, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చీకటి కార్తీక్, నియోజకవర్గ అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి, నాయకులు సుందర్‌రాజు,రావి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.