
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థానిక కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో అభాగ్యులకు అనర్ధులకు యాచకులకు ఐక్య తల్లిదండ్రుల ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం శ్రీలతబాలకిషన్ దంపతుల కుమారుడు అద్విత్ పుట్టినరోజు సందర్భంగా యాచకులకు అభాగ్యులకు అన్నదానం చేయడం జరిగింది.సంఘ నాయకులు మాట్లాడుతూ..ప్రతి ఒక్కరు సేవగుణం కలిగి ఉండాలనీ అన్నారు.ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మారుతిరత్న,జిల్లా ప్రధాన కార్యదర్శి బాలు నాయక్,షార్ట్ ఫిలిమ్స్ యాక్టర్స్ మరియు డైరెక్టర్లు నాని సంపత్,సహస్,శివ గాంధీ, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు
