భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ లో డయాలసిస్ పేషెంట్ కు అత్యవసరంగా ఎబి పాజిటివ్ బ్లడ్ అవసరం ఉండగా విజయ్ బ్లడ్ బ్యాంక్ కొత్తగూడెం ఇన్చార్జి రక్తదాత బి.వినోద్ కుమార్ వెంటనే వెళ్లి రక్తదానం చేయడం జరిగింది. ఇప్పటికే 15 సార్లు రక్తదానం చేసి అనేక రక్తగ్రహీతలు కాపాడిన ఘనత ఆయనది. గ్రూప్ సభ్యులు,పలువురు ప్రముఖులు ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. యువత ముందుకు వచ్చి ఆపదలో ఉన్న వారికి ఆదుకోవాలని విజయ్ బ్లడ్ బ్యాంక్. అడ్మిన్ మరియు సభ్యులు కోరారు.అత్యవసర పరిస్థితి లో రక్తం అవసరమున్న వారు విజయ్ బ్లడ్ బ్యాంక్ కొత్తగూడెం జిల్లా ఇన్చార్జి వినోద్ కుమార్8897215883 నంబర్కు సంప్రదించవచ్చు.