మహబూబాబాద్:బయ్యారం మండల కేంద్రము లో టిఎస్ టిటిఎఫ్ మండల శాఖ అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శి భావుసింగ్,బాలాజీ ఆధ్వర్యంలో సర్వసభ్య కార్య వర్గ సమావేశం సోమవారం నాడు జరిగింది.రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బానోతు.ఈరు నాయక్, బానోత్. రాములు నాయక్, గౌరవ అధ్యక్షుడు శివ నాయక్, ఉపాధ్యక్షులు రంగన్న ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు వీరు నాయక్ మాట్లాడుతూ..ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ డి ఎ లను ప్రకటించాలని,జి ఓ యం ఎస్ నెం.3 స్థానంలో మరొక జి ఓ తీసుకురావాలని, పీఆర్సీ వెంటనే ప్రకటించాలని, పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈకార్యక్రమములో మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు మాలోత్ భద్రు నాయక్,భాస్కర్ మరియు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బిచ్చ నాయక్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మోహన్ నాయక్,గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మణ్ రావు, ఉపాధ్యాయులు శంకర్,గార్ల మండల అధ్యక్షులు వీరు నాయక్,మరియు భాస్కర్,రాజు,రమేష్,శ్రీను, రామారావు, రాజు,రాము,డి.ఎస్ కిషన్, చిరంజీవి,బేబీ,కుమారి, అమ్మిక, చిరంజీవి,శంకర్,సక్రు, రాంజీ,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.