Tue. Mar 24th, 2026


సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు మేడే లోపూ ఈఎస్ఐ అమలు చేయాలని కోరుతూ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం ఎస్ సి కె ఎస్- సిఐటియు ఆధ్వర్యంలో సింగరేణి డైరెక్టర్ పా గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈఎస్ఐ అమలతో పాటు దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఎస్సీ కేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి మధు డిమాండ్ చేశారు. డైరెక్టర్ పా తోటి పలు సమస్యలపై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా బి మధు మాట్లాడుతూ మూడు సంవత్సరాల క్రితం ఈఎస్ఐ అమలుకు అంగీకరించినప్పటికీ అందుకు అవసరమైన నిధులు ఈఎస్ఐ కి జమ చేయకపోవడం మూలన కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని కాంట్రాక్ట్ కార్మికుల ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈఎస్ఐ అమలకు నిధులు విడుదల చేయడంతో పాటు మే ఒకటో తేదీ నాటికి సింగరేణి వ్యాప్తంగా ఈఎస్ఐ అమల్లోకి తీసుకురావాలని డైరెక్టర్ పాను కోరారు. బెల్ట్ క్లీనింగ్ మరియు సెల్ పికింగ్ కార్మికులకు సెమీస్కిల్డ్ వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు టన్నెల్ లోపల మరియు ఎత్తైన ప్రదేశాల్లో పని చేస్తున్న బెల్ట్ క్లీనింగ్ కార్మికులకు జీవో కంటే అదనంగా 20% వేతనం చెల్లించాలని సర్కులర్లో ఉన్నప్పటికీ సింగరేణి యాజమాన్యం దాన్ని అమలు చేయడం లేదని తక్షణమే సర్కులర్ ప్రకారం 20 శాతం అదనపు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు పని ప్రదేశాల్లో ప్రమాదం జరిగి గాయపడిన కాంట్రాక్ట్ కార్మికులకు మెరుగైన వైద్య సేవలను అందించడం కోసం రిఫరల్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు కాంట్రాక్ట్ కార్మికులకు సరియైన రక్షణ సౌకర్యాలు అందుబాటులో లేని కారణంగానే ప్రమాదాలకు గురవుతున్నారని ప్రమాదాలకు గురై సరియైన వైద్యం కూడా అందడం లేదని ఈ విషయంపై సింగరేణి యాజమాన్యం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్సీ కే ఎస్ సి ఐ టి యు డైరెక్టర్ పానుకోరింది కాన్వెంట్స్ వాహనాల బిల్లుల నుండి కోత విధించిన 15% డబ్బుల సమస్యను వెంటనే పరిష్కరించాలని ఎస్సీ కే ఎస్ సి ఐ టి యు కోరింది ఈ డబ్బులను సీఎం పీఎఫ్ ఖాతా కన్నా జమ చేయాలని లేదంటే కార్మికులు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు 24 నెలలుగా 15% డబ్బులను చట్ట వ్యతిరేకంగా యాజమాన్యం తన దగ్గర ఉంచుకొని సమస్యను పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం వహిస్తుందని సిఐటియు ఎస్సీ కేఎస్ విమర్శించింది వారం రోజుల్లో పరిష్కారం చేస్తామని మూడు నెలల క్రితం హామీ ఇచ్చిన అధికారులు ఇప్పటివరకు ఎటువంటి పరిష్కారాన్ని చూపకుండా తాత్సారం చేయటాన్ని ఎస్సీ కేఎస్ డైరెక్టర్ పా దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈ విషయాలపై స్పందించిన డైరెక్టర్ పా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను సంబంధిత అధికారులతో చర్చించి త్వరితగతిన పరిష్కారం చేసే విధంగా ఆదేశాలు జారీ చేస్తామని డైరెక్టర్ పా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం ఎస్సీ కేఎస్ సిఐటియు నాయకులకు హామీ ఇచ్చారు సింగరేణి ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్ పాణి కలిసిన వారిలో సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కే బ్రహ్మచారి కొత్తగూడెం బ్రాంచ్ ఉపాధ్యక్షులు భూక్య రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Share this post...