Tue. Mar 24th, 2026

 

తెలంగాణ రాష్ట్రంలో ఎదుర్కొంటున్న ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల తక్షణ పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మణుగూరు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఐలయ్య, షేక్ మీరా హుస్సేన్ లు మణుగూరులో జరిగిన మండల ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పెండింగ్ లో ఉన్న డీఏలను తక్షణమే విడుదల చేయాలని,రాష్ట్ర రెండవ పేరివిసన్ కమిషన్ రిపోర్టును సత్వరమే తెప్పించుకొని 1.7.23 నుండి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.అన్ని ఆసుపత్రులలో ఉద్యోగ ఉపాధ్యాయులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ ని అమలు చేసే విధంగా ఉద్యోగ ఉపాధ్యాయుల ఆరోగ్య పథకాన్ని అమల్లోకి తేవాలన్నారు.సిపిఎస్ రద్దుచేసి తక్షణమే పాత పెన్షన్ విధానమైన ఓ పి ఎస్ ను తిరిగి పునరుద్ధరించాలని అన్నారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వ మెమో ప్రకారం వెంటనే పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలన్నారు.కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నూతన పెన్షన్ విధానంలో ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ను పెంచాలన్నారు. ఈ వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయులకు ప్రమోషన్లు మరియు బదిలీలు నిర్వహించాలన్నారు.విద్యా సంవత్సరం మధ్యలో బదిలీ నిర్వహిస్తే విద్యకు ఆటంకం ఏర్పడుతుందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవను తీసుకుని ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనల సమస్యను పరిష్కరించాలన్నారు. అనంతరం చర్చలో ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయుటకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రభుత్వ బడులలో విద్యార్థుల సంఖ్యను పెంచడం కోసం ఇప్పటినుండే టీచర్స్ తల్లిదండ్రులను కలిసి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేపించుటకు ప్రత్యేక చొరవ చూపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షురాలు తోట విజయలక్ష్మి, కోశాధికారి పూణెం నాగేశ్వరరావు, సంఘ సభ్యులు కొమరం నర్సింగరావు,వి.కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు

Share this post...