Wed. May 20th, 2026

రామయ్య గారి జీవితం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి దాయకం.వనజీవి అకాల మరణంతో తెలంగాణ ప్రకృతి యోధుడిని కోల్పోయింది.ప్రపంచ పర్యావరణం కోసం రామయ్య గారి కృషి చిరస్కరణీయం.ఖమ్మం జిల్లా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిచెప్పారు వనజీవీ.ప్రకృతికి, పర్యావరణ పరిరక్షణకై ఆయన చేసిన కృషికి గాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో ఘనంగా సత్కరించింది. రామయ్య గారి మరణం పర్యావరణానికి తీరని లోటు. ప్రపంచ పర్యావరణ వేత్తని కోల్పోయాం.ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి.పచ్చదనాన్ని భావి తరాలకు ఆస్తులుగా పంచిన వనజీవి లేని లోటు భూతల్లికి తీరని లోటు.వనజీవి (దరిపల్లి )రామయ్య (87) గారి ఆత్మకు శాంతి చేకూరాలని, జిల్లాలోని ప్రముఖ ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ పరిరక్షకులు రామయ్య కుటుంబ సభ్యులందరికీ,ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలిపారు.

Share this post...