
లక్ష్మీదేవి పల్లి మండలం శ్రీనగర్ కాలనీ పంచాయతీ పరిధిలోని ఇందిరానగర్ కాలనీ లో గీతా ఆశ్రమం దగ్గర నివాసం ఉంటున్న కర్నాటి కృష్ణకుమారి కుటుంబం పూర్తిగా దివ్యాంగ కుటుంబం.కుటుంబానికి పెద్ద దిక్కు కూడా కోల్పోయారు.ఈ నేపథ్యంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం ఇండియన్ స్కౌట్ అండ్ గైడ్ ఫెలోషిప్ (ఐఎస్. జి.ఎఫ్),ఉమెన్స్ గిల్డ్ ఆధ్వర్యంలో ఆ కుటుంబానికి నిత్యావసర సరకులను, కూరగాయలు,పండ్లు,నగదు కొంత అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎస్జిఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు లోగాని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాసిం, ఉమెన్స్ గిల్డ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ నూరిమెహరున్నిసా, జిల్లా కో ఆర్డినేటర్ జ్యోతిరాణి,జిల్లా ప్రతినిదులు చుంచు ఆంజమ్మ,కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
