తెలంగాణలో విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డ్ సిద్ధమైంది.ఈ నెల 22న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డ్ తెలిపింది.ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేయబోతున్నారు.ఇంటర్ ఫలితాలు నేరుగా ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in లేదా results. cgg.gov.in లో అందుబాటులో ఉండనున్నాయి.
