ఎంపీపీఎస్ లక్ష్మీదేవి పల్లి నందు గ్రాడ్యుయేషన్ కార్యక్రమం.చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి ప్రాథమిక పాఠశాల నందు శనివారం ఐదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం మరియు గ్రాడ్యుయేషన్ సెర్మొనీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఎంఇఓ పెండేకట్ల కృష్ణయ్య,జెడ్పీ హెచ్ ఎస్ లక్ష్మీదేవి పల్లి కాంప్లెక్స్ హెచ్ఎం. ముఖ్య అతిథిగా హాజరయ్యారు.విద్యార్థులు పై తరగతులకు వెళుతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ కష్టపడి చదవాలని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని వక్తలు అన్నారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రిటైర్ ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం వరలక్ష్మి,పాఠశాలల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు శైలజ,మాధవి,మోతిలాల్ మోహన్ రాథోడ్,సి ఆర్ పి. నాగరాజు, ఎం ఐ ఎస్. రాజేష్ అంగన్వాడి టీచర్ అంజమ్మ మరియు స్కావెంజర్స్ తదితరులు పాల్గొన్నారు
