
ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా వేసవి సెలవుల్లో విద్యార్థులు విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ఇంగ్లీష్, లెక్కలు సబ్జెక్ట్ ల్లో ప్రాక్టీస్ చేసుకునే విధంగా ఇండియన్ స్కౌట్ అండ్ గైడ్ ఫెలోషిప్ (ISGF ) ఆధ్వర్యంలో ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బొమ్మనపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యేక పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది.ఎస్ జి ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు లోగాని శ్రీనివాస్ చేతుల మీదుగా జరిగిన ఈ పంపిణీ కార్యక్రమంలో ఎస్జీఎఫ్ ఉమెన్స్ గిల్డ్ జిల్లా కో -ఆర్డినేటర్ ఎం.జ్యోతి రాణి,ఇన్చార్జి హెచ్ఎం జరపల పద్మ, ఐఆర్పి టీచర్ నీరజ షారోన్, అంగన్వాడీ టీచర్స్ విజయ లక్ష్మి, విజయ,విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
