PM.SHRI ప్రభుత్వ ఉన్నత పాఠశాల కూలీ లైన్ కొత్తగూడెం నందు ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాల కాంప్లెక్స్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే బాల బాలికల కొరకు ఫ్రీ సమ్మర్ ఫ్రీకోచింగ్ క్యాంప్ ప్రారంభించారు.ఉదయం ఎనిమిది గంటల నుండి 11 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రతిరోజు నిర్వహించబడుతుందను హెచ్ ఎం లాలు అన్నారు.ఇందులో కంప్యూటర్ పరిజ్ఞానం, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్, యోగా, వ్యాయాయము మరియు క్రీడల అంశాల పై నేటి 15 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించబడతాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఏపీసి చైర్ పర్సన్ మునిగ సుజాత హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు భూక్యా లాలు ఉపాధ్యాయుల భూక్యా హరిబాబు,రామారావు,మాజీ వార్డు కౌన్సిలర్ బండారి రుక్మాంగధర్,వార్డు ఆర్ పి, పాఠశాల తల్లిదండ్రులు శిక్షణా తరగతుల వాలంటీర్లు,బస్తీ వాసులు మరియు విద్యార్థినీ, విద్యార్థులు సుమారుగా 30 మంది మొదటి రోజు పాల్గొనడం జరిగినది.అదే విధంగా ప్రభుత్వ కూలీల లైన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థి తండ్రిని శాలువాతో సత్కరించిన అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ మునిగ సుజాత మరియు మాజీ కౌన్సిలర్ బండారి రుక్మాంగదర్,లాలు, దేవిలాల్ రామారావు,గుమలాపురం సత్యనారాయణ,రజిత, తదితరులు పాల్గొన్నారు.
