దిగుబడులు ఆశాజనకంగా ఉన్నా గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు.వేలాది రూపాయలు పెట్టి ఎకరం వరి పంట సాగు చేయాలంటే పెట్టుబడికి కష్టంగా ఉన్నా చేస్తున్నారు. నాట్లు మొదలుకొని పంట నూర్పిడి వరకు చీడ పీడలను నివారిస్తూ తీరా పంట చేతికి వచ్చాక మార్కెట్లో సరైన ధర లేక కొనుగోలు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. తక్కువ ధరకు అమ్ముకొని నష్టాల పాలవుతున్నామని అన్నదాతలు వాపోతున్నారు. దీంతో రైతులు సుజాత నగర్ మండల కేంద్రంలో రాస్తా రోకో చేశారు.ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.ఈ కార్యక్రమంలో పుల్లయ్య,మూడ్ శంకర్, భుక్య భీమ,మూడ్ రవీందర్, మోబ్లాలి స్థానిక రైతులు పాల్గొన్నారు.
