
కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో గల రామవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం 2024 లో పదవ తరగతి చదివిన హిమబిందు ఆనాడు 8.2 జిపిఏ సాధించి పేరొందిన విద్యాసంస్థ అయిన తెలంగాణ గురుకుల సంస్థలో ఇంటర్మీడియట్లో ఎంపీసీ ఉచిత సీటును సాధించింది.తండ్రి సుతారి మేస్త్రి,ఇటీవల ప్రభుత్వo విడుదల చేసిన జూనియర్ ఇంటర్ ఫలితాల్లో 458/470 (97%) సాధించినందున హిమబిందును ప్రోత్సహిస్తూ రామవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ యం మరియు ఎంఈఓ డాక్టర్ ప్రభుదయాల్ నూతన వస్త్రాలు,రాత పుస్తకాలు,క్యాష్ అవార్డును నేడు అందజేశారు.హిమబిందు తల్లికి సైతం చీరను బహుకరించారు.పేదరికం చదువుకు అడ్డంకి కాదనీ,చదివే బీదరికాన్ని తరిమేస్తుoదని,విజేతగా నిలుపుతుందన్నారు.చదువే తలరాతను సైతం మార్చుతూ భవిష్యత్తును నిర్ణయిస్తుంది కావున చదువుపైనే విద్యార్థుల దృష్టి సారించాలన్నారు.
