Tue. Mar 24th, 2026

వర్షపు నీటిని వృధా చేయకుండా ఇంకుడు గుంతల ద్వారా భూగర్భజలాలను రీఛార్జ్ చేయాలనే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రతి పాఠశాలలో ఇంకుడు గుంత నిర్మించాలని ఆదేశించారు.ఈ మేరకు కొత్తగూడెం మండలంలో గల సకల ప్రభుత్వ పాఠశాలలో ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తయినట్లు ఎంఈఓ డాక్టర్ ప్రభుదయాల్ తెలిపారు.అలాగే మండలంలో రామవరం, కూలీలైన్,ఆనందఖని ఉన్నత పాఠశాలలో వేసవి శిక్షణా శిబిరాలు నిర్వహించబడు తున్నాయనీ 6 నుండి 9 తరగతుల విద్యార్థినీ, విద్యార్థులు ఈ శిబిరాల్లో పాల్గొంటూ వేసవి సెలవుల్ని అర్థవంతంగా ఆహ్లాదకరంగా వినియోగించుకోవాలని కోరారు.రేపు (బుధ) పాఠశాలలకు గ్రీన్ బోర్డులు సరఫరా కానున్నట్లు ఎంఈఓ తెలిపారు.

Share this post...