
కామ్రేడ్ మచ్చా రాధా అనారోగ్య కారణాలతో మే4 న హైదరాబాదులో వారి స్వగృహంలో స్వర్గస్తులైనారు.ఈ సందర్భంగా మే 7న వారి సంస్మరణ సభను బుధవారం నాడు TSUTF పాల్వంచ ప్రాంతీయ కార్యాలయంలో సంస్మరణ సభ నిర్వహించారు.ఉపాధ్యాయులు మరియు సీనియర్ కార్యకర్తలు, రిటైర్డ్ టీచర్స్ అందరూ హాజరై ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమానికి TSUTF జిల్లా ప్రధాన కార్యదర్శి యం.వెంకటేశ్వర్లు హాజరై ఘన నివాళులు అర్పించి ఆమె సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ పి జి హెచ్ ఎం శారదా లక్ష్మి,జిల్లా కార్యదర్శి ఎస్కే. పాష,పాల్వంచ మండలం అధ్యక్షులు విజయ భాస్కర్, మండల కార్యదర్శి ఎం.శ్రీనివాస రావు,సీనియర్ నాయకులు మల్లికార్జున రావు,సీనియర్ సభ్యులు ఏ ఎన్ ఆర్, డి.శ్రీనివాసరావు,అంబ్రిక జాదవ్ తదితరులు పాల్గొన్నారు.
