
లక్ష్మీదేవి పల్లి మండలం కమిటీ ఆధ్వర్యంలో లక్ష్మిదేవిపల్లి ఎంపీడీవో కార్యాలయం ముందు సీపీయం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.రాష్ట్ర ప్రభుత్వ ఇచ్చిన 6 గ్యారెంటీ హామీలను దక్షణమే అమలు చేయాలి అలాగే గ్రామాలలో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని పెన్షన్ దారులకు పెంచి ఇవ్వాలని ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను తక్షణములు చేయాలని డిమాండ్ చేస్తూ లక్ష్మిదేవిపల్లిలో ప్రదర్శన అనంతరం ఎంపీడీవో కార్యాలయం ధర్నా నిర్వహించారు.అనంతరం ఎంపీడీవో కు మెమొరాండం అందజేశారు.తక్షణం స్పందించకుంటే భవిష్యత్తులో ఉద్యమం ఉదృతం చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ మండల కార్యదర్శి వాంకుడోత్ కోబాల్,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అన్నవరం సత్యనారాయణ,మండల కమిటీ సభ్యులు వాంకుడోత్ అమర్ సింగ్, వెంకన్న లకావత్ కుమార్,విజయ కుమార్,సురేష్,సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
