
కొత్తగూడెం పట్టణం పరిధిలోని ఏ ఒక్క వైన్ షాప్ లో కూడా బ్రాండెడ్ మద్యం దొరకకుండా కేవలం పేదలు తాగే మద్యాన్నే టార్గెట్ గా పెట్టుకొని వాటిని మాత్రమే వైన్ షాప్ లలో అమ్మకానికి లేకుండా కేవలం బెల్ట్ షాప్ లలో మాత్రమే దర్శనమిచ్చేలా.. కొత్తగూడెం సిండికేట్ వ్యాపారస్థులు చీకటి దందాని కొనసాగిస్తున్నారని లక్ష్మీదేవిపల్లి బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర రావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారికి లేఖ రాశారు.వైన్ షాపుల్లో దొరకని మద్యాన్ని సిండికేట్ వాళ్ళు సుమారుగా ఒక్కొక్క క్వార్టర్ పై 70 రూపాయలు మరియు ఒక్క బీర్ పై సగటున 50 రూపాయలు పెంచి బెల్ట్ షాపుల ద్వారా విక్రయిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యులు,కూలి పని చేసుకునే వారు ఆర్థిక దోపిడికి గురవుతున్నారు కావున పేదవాని జోబులకు చిల్లులు పడకుండా ఇట్టి వైన్ షాపులపై తగు చర్యలు తీసుకొని అన్నిరకాల మద్యాన్ని వైన్ షాపులలో అందుబాటులో ఉండేవిధంగా మరియు యం.ఆర్.పి రేట్లకు మాత్రమే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
