Mon. Feb 2nd, 2026

సుజాతనగర్ మండలం సర్వారం గ్రామపంచాయతీ గోప తండా గ్రామంలో ప్రకృతి దేవతలను ఆరాధిస్తూ పశుసంపద వర్ధిల్లాలని కోరుతూ తండ ప్రజలు యువతి యువకులు శీతల.. పండగ జరుపుకున్నారు. పంటలు సమృద్ధిగా.. పండాలని పశుసంపద మంచిగా ఉండాలని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని శీతల భవాని అమ్మవారిని కోరుకున్నారు. అతి పురాతన ..ఈ పండుగను తమ ..తొలి పండుగగా నేటికీ మారుమూల తండాల్లో గిరిజనులు అత్యంత ..వైభవంగ జరుపుకోవడం విశేషం. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాలోత్ భద్రు నాయక్, మాలోత్ భజ్య నాయక్,మాలోత్ కిషన్,బి.కిషన్ కెలోత్ భీము,కెలోత్ ఈరు రమేష్, ఉద్యోగులు రాష్ట్ర గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం జనరల్ సెక్రెటరీ,కేటీపీఎస్ పాల్వంచ ఎ.డి యం.రమేష్, సోషల్ మీడియా కన్వీనర్ బాలు నాయక్, ఎఫ్ఎస్ఓ లోక్ నాథ్ ,టీచర్ భూక్యా కిషన్, యం.మోహన్, మోహన్,రంజిత్ కుమార్, యం రత్న, సుక్కో స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Share this post...