బంజారాల ప్రకృతి పండగ అయినా శీతల పండుగను లక్ష్మీదేవి పల్లి మండలం బాబుజి తండా గ్రామంలో ప్రజలు ఘనంగా జరుపుకోవడం జరిగింది, వర్షాలు సమృద్ధిగా కురవాలని చెరువులు కుంటలు నిండాలని పాడి పరిశ్రమ అభివృద్ధి కావాలని పంటచేలు సమృద్ధిగా పండాలని పల్లెలు పచ్చదనంతో కళకళలాడాలని ప్రకృతి దేవతలైన సాతిభవాని సీట్ల పండుగను బంజారా గిరిజనులు జరుపుకోవడం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయము ఈ సాంప్రదాయాన్ని మండలంలోని బాపూజీ తండా గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించడం జరిగింది, సాంప్రదాయ నృత్యాలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు,మహిళలు చిన్నారులు గ్రామ ప్రజలు అందరూ ఉత్సాహంగా పాల్గొని తమ సాంప్రదాయ పండుగను జరుపుకోవడం జరిగింది.
