
శ్రీనగర్ కాలనీలోని కోనేరు నివాసంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం ఆధ్వర్యంలో కొత్తగూడెం క్లబ్ కార్యదర్శి లయన్ కోనేరు పూర్ణ చందర్ రావు జన్మ దిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.కేక్ కట్ చేసిన అనంతరం శ్రీనగర్ కాలనీ లో మొక్కలు నాటటం మరియు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా భద్రాద్రి జిల్లా ప్లానింగ్ అధికారి, మైనారిటీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి లయన్ కె సంజీవరావు భద్రాచలం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ తాళ్లూరి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ ప్రజా ప్రతినిధిగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ గవర్నర్ గా విశేష సేవలు అందించిన మాజీ మంత్రివర్యులు స్వర్గీయ కోనేరు నాగేశ్వరావు గారి అడుగుజాడల్లో అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే కొత్తగూడెం క్లబ్ కార్యదర్శి సీనియర్ లయన్ కోనేరు పూర్ణచందర్రావు రానున్న రోజుల్లో కోనేరు ట్రస్టు ద్వారా మున్ముందు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.తన జన్మదినం సందర్భంగా ఈరోజు విరివిగా మొక్కలు నాటడం,పంపిణీ చేయడం పర్యావరణ పరిరక్షణ పట్ల వారికున్న సామాజిక బాధ్యతను తెలియజేస్తుందని ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఆయనను ముఖ్య అతిథులు ఘనంగా శాలువాలు బొకే ల తో సన్మానించారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం అధ్యక్షులు లగడపాటి రమేష్ చంద్ కోశాధికారి శ్రీశైలం జయ కుమార్, సీనియర్ లయన్స్ క్లబ్ సభ్యులు దామోదర్ దాస్, మన్నెం జవహర్ రెడ్డి ,కూర శ్రీధర్,షేక్ దస్తగిరి,బాలు,బీసీ సంఘం నాయకులు ముత్యాల హనుమంత రావు,గుములా పురం సత్యనారాయణ,కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
