Mon. Feb 2nd, 2026

భద్రాద్రి జిల్లా టి ఎస్ టిటిఎఫ్ కమిటి ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ సూపర్డెంట్ కు పలు సమస్యలతో కూడిన మెమోరాండం అందజేశారు.ఈ సందర్భంగా టి ఎస్ టిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్ రాములు నాయక్ మాట్లాడుతూ..ఏజెన్సీ ప్రాంతంలో డిఎస్సీ 2000 నుండి టి ఆర్ టి 2017 వరకు ఏజెన్సీ ప్రాంతం, మైదానం ప్రాంతం వేరువేరుగా రిక్రూట్మెంట్ జరిగాయి. జీవో నెంబర్ 3 ప్రకారం 100కు 100% గిరిజన ఉపాధ్యాయులతో భర్తీ చేసిన ప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో వివిధ ప్రమోషన్ క్యాడర్ సైన్న్త్ లో గిరిజన ఉపాధ్యాయులే అధికంగా ఉన్నారు. ఏజెన్సీలో ప్రత్యేక చట్టాలు జీవోలు ఉన్నప్పుడు ప్రమోషన్లో అడక్వసి విధానాన్ని ఎలా వర్తింపజేస్తారు అని ప్రశ్నించారు. ఈ ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధం తక్షణమే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుండి క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే ప్రమోషన్ నిర్వహించాలని అప్పటిదాకా ప్రమోషన్ ని నిలుపుదల చేయాలని,సుప్రీంకోర్టు జీవో నెంబర్ 3 కి వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇచ్చి ఐదు సంవత్సరాలైనా ప్రభుత్వం ఇంతవరకు సపోర్టింగ్ ఆర్డర్ ఇవ్వనందున జీవో నెంబర్ 3 ప్రకారం మాత్రమే ప్రమోషన్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. 2009 విద్యాహక్కు చట్టం ఎన్ సి ఆర్ టి నిబంధన ప్రకారం టెట్ కు సంబంధించి సుప్రీంకోర్టు హైకోర్టు లో కేసు పెండింగ్లో ఉన్నందున టెట్టు క్వాలిఫైడ్ అయిన వారికీ మాత్రమే ప్రమోషన్ కల్పించాలని… అదేవిధంగా డిఎస్సీ 2000,2001,2002 అన్ ట్రైనడ్ ఉపాధ్యాయు లకు నియామకపు తేదీ నుండి మాత్రమే సర్వీసును ప్రమోషన్ కు పరిగణించాలి.డిఎస్సీ 2008 (2025 ఫిబ్రవరి నుండి 2026 మార్చి వరకు) ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నియామకం పొందిన కాంట్రాక్టు ఉపాధ్యాయులకు బడ్జెట్ సరెండర్ లెటర్ పై ఆర్థరైజ్డ్ చేసి డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కు బడ్జెట్ రీటన్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టి ఎస్ టిటిఎఫ్ సీనియర్ నాయకులు బానోత్ మంగీలాల్,బట్టు చందర్,రాష్ట్ర సలహాదారు ఎల్ వి బి ఎం రత్నాకర్,జిల్లా అధ్యక్షులు మోహన్ రాథోడ్,జిల్లా ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాబులాల్, కొత్తగూడెం మండల అధ్యక్షులు హరిబాబు, జూలూరు పాడు మండల ప్రధాన కార్యదర్శి ధరావత్ హనుమ,లక్ష్మీదేవి పల్లి మండల అధ్యక్షులు కృష్ణ,బిక్కు లాల్,హరిదాసు,2008 డీఎస్సీ ఎల్.రవి తదితరులు పాల్గొన్నారు.

Share this post...