సముద్రాల సుధాకర్ కుమారుడి రిసెప్షన్ గౌతమ్ పూర్ కమ్యూనిటీ హాల్ లో జరిగింది.ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిధులకు రిటర్న్ గిఫ్టుగా మొక్కలను అందజేస్తూ మొక్కలు పర్యావరణానికి మేలు చేస్తాయని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అతిధులను కోరుతూ వచ్చిన అతిథుల కు మొక్కలను పంపిణీ చేయడం జరిగినది. స్థానిక కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని.సాంబశివరావు,ట్రేడ్ యూనియన్ నాయకులకు సింగరేణి అధికారులకు ప్రముఖ రాజకీయ నాయకులకు బంధుమిత్రులకు మొక్కలు అందించడం జరిగింది. ఈ చిన్నోడు చిరంజీవి మహమ్మద్ ఆఫాన్ జైదీ తన 2వ ఏటా నుండి మొక్కలు నాటుతూ మొక్కలని బహుమతిగా అందించటం కాటన్ బ్యాగులు వాడాలని ప్రచారం చేయడం,ప్లాస్టిక్ వాడ వద్దని స్టీల్ అండ్ ప్రకృతి సంబంధిత బాటిల్స్ లలో నీరు తాగాలని ప్రచారం చేయడం,వివిధ రకాల గింజలు ఏరి నాటడం,వన్యప్రాణుల గురించి కృషి చేయడం వంటి ఎన్నో ప్రకృతి సేవా కార్యక్రమాలు చేసి పలువురిని ఆలోచింప చేస్తున్నాడు.ఈ చిన్నారిని పలువురు అభినందించారు.తనని ప్రకృతి సేవలు చేయుటకు కృషి చేస్తున్న ప్రకృతి ప్రేమికుడు మొక్కల రాజశేఖర్ ను,ఈ చిన్నోడి తల్లిదండ్రులు రేష్మ, అమన్ ను,తాతయ్య నానమ్మ ముస్తఫా పర్వీన్ లను అభినందించారు.
