Sat. Mar 21st, 2026

కొత్తగూడెం: పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతరం మొక్కలు నాటుతూ,ప్రకృతి హరిత దీక్ష ద్వారా అనేక మందికి మొక్కలు నాటే అలవాటు కలిగించిన మొక్కల రాజశేఖర్ కు అరుదైన గౌరవం దక్కింది.గతంలో “మన్ కీ బాత్” కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు అందుకున్న రాజశేఖర్, ఈసారి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ నిర్వహించే తేనేటి విందుకు రాజ్ భవన్ నుండి ఆహ్వానం అందుకున్నారు. పర్యావరణ ప్రేమ,ప్రజలలో హరితస్ఫూర్తి కలిగించే తన కృషి ఫలితంగా ఈ ఆహ్వానం రావడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రముఖులు, ప్రకృతి ప్రేమికులు అభినందనలు తెలిపారు

Share this post...