Wed. May 6th, 2026

సీపీఐ రాష్ట్ర మహాసభలు పార్టీ పురోగతికి,ప్రజాసమస్యల పరిస్కారానికి దోహదపడతాయి.రాజకీయ చైతన్యంతో పార్టీ శ్రేణులు ప్రజల్లో మమేకం కావాలి.జిల్లా సమగ్రాభివృద్ధి సమస్యల పరిస్కారమే అజెండాగా ఉద్యమాలు నిర్మిద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదాం.జిల్లా కార్యవర్గ సమావేశంలో కార్యదర్శి సాబీర్ పాషా అన్నారు. ఆగస్టు 20 నుండి 22 వరకు జరగనున్న సిపిఐ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయండి. జిల్లా కార్యవర్గ సభ్యులు వీసంశెట్టి పూర్ణ చంద్ర రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వ నాథం,కల్లూరి వెంకటేశ్వర్లు,నారాటి ప్రసాద్,సర్రెడ్డి పుల్లా రెడ్డి,నున్న లక్ష్మీ కుమారి,ఎస్ డి సలీం,చంద్ర గిరి శ్రీనివాస రావు,రేసు ఎల్లయ్య,సలిగంటి శ్రీనివాస రావు,చండ్ర నరేంద్ర కుమార్,కమటం వెంకటేశ్వర్లు,దేవర కొండ శంకర్,అడుసు మల్లి సాయిబాబా,కంచర్ల జమలయ్య,భూక్య దసురు, జి.వీరాస్వామి,వాసిరెడ్డి మురళి,బంధం.నాగయ్య,ఉప్పు శెట్టి రాహుల్,ఎస్ కే ఫహీమ్,అడ్డగర్ల తాతాజీ,మువ్వ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Share this post...