
“ప్రకృతి హరిత దీక్ష , భావితరాలకు రక్ష” అనే నినాదంతో పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవు తున్నారు.“ప్రకృతిని మనం కాపాడితే… ప్రకృతి మనల్ని కాపాడుతుంది” అనే సందేశాన్ని వ్యాప్తి చేస్తూ మహిళలు కూడా కోటి గింజల సేకరణ,నాటే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఇల్లెందు క్రాస్ రోడ్ సమీపంలో రేగళ్ల రోడ్ వెంబడి ఫారెస్ట్ పరిసరాల్లో అశోక, మామిడి,జీడిమామిడి,ఈత,అడవి బాదం గింజలు నాటారు.ఈ సందర్భంగా భారతి,భాగ్యలక్ష్మి, రాజకుమారి,జ్యోతి,ఆటో డ్రైవర్ మిత్రుడు,కొత్తగూడెం పి.ఎల్.విలు,ఏడుకొండల ఎస్.హెచ్. గ్రూప్ సభ్యులకు అభినందలు తెలిపిన భద్రాద్రి కొత్తగూడెం ప్రకృతి హరిత దీక్ష,గ్రీన్ మోటార్ వెహికిల్ గార్డెన్ వ్యవస్థాపకుడు సింగరేణియన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చే ప్రశంసలు అందుకున్న మన కీ బాత్ కె ఎన్ రాజశేఖర్.
