. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల కమలాపురంలో ఇన్స్పైర్ మరియు ఇగ్నైట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం మేటిమేషన్ విద్యార్థులకు ప్రేరణ,నడవడిక, జ్ఞానం అనే అంశం కార్యక్రమంలో అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ.,. విద్యార్థులకు ప్రేరణ అనేది చాలా ముఖ్యం,జ్ఞానం అంటే కేవలం పుస్తకాలలో ఉన్నది మాత్రమే కాదు,అది విద్యార్థుల జీవితాన్ని అర్థం చేసుకోవడానికి సహాయ ఉపయోగపడుతుందని అన్నారు. జ్ఞానం అంటే కేవలం పుస్తకాలలో ఉన్నది మాత్రమే కాదు. విద్యార్థుల జీవితాన్ని అర్థం చేసుకోవడానికి జ్ఞానం అవసరమని ఆయన అన్నారు. విద్యార్థులలో ఉండే అంతర్గత నైపుణ్యాలను వెలికి తీసి ఉపాధ్యాయులు సర్వశక్తుల కృషి చేయాలని ఆయన కోరారు. విద్యార్థులు చదువుతోపాటు నైతిక విలువలు సామాజిక దృక్పథం, నడవడి జ్ఞానం, సమాజం పట్ల అవగాహన కలిగి ఉండాలని ఆయన ఆకాంక్షించారు.విద్యార్థులు లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ బాగా న నేర్చుకున్నప్పుడే ఆర్థికంగా విద్యార్థులు నిలబడతారని,విద్యార్థులు అర్థం చేసుకోవాలన్నారు.ఈ సందర్భంగా దమ్మపేట సహాయ గిరిజన అభివృద్ధి అధికారి చంద్రమోహన్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రేరణ అనేది ముఖ్యమని అన్నారు ఉపాధ్యాయులు లక్ష్యాలను ఏర్పర్చుకోవడం లక్ష్యాలను సాధించే విధంగా విద్యార్థులకు జ్ఞానం పెంపొందించే విధంగా చూడాలని అన్నారు. విద్యార్థులు చదవడానికి పుస్తక అలవాటు చేసుకోవాలని ఆయన అన్నారు. ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు బాధ్యతాయుతంగా ఉండి చదువు పైన దృష్టి జ్ఞానం,నడవడిక ప్రేరణ పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. అనంతరం ఇన్స్పైర్ మరియు ఇగ్నైట్ కార్యక్రమంలో మెంటర్స్ గా, సంపత్, నవీన్,జైపాల్ వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఎల్ ఎఫ్ ఎల్ ప్రధానోపాధ్యాయులు గోవింద్,ఎస్ సి ఆర్పి శ్రీను,ఉపాధ్యాయులు రామ్ కిషన్,సత్య నారాయణ,వెంకటేశ్వరరావు,లక్ష్మీబాయమ్మ, వెంకటేశ్వర్లు, ప్రత్యూష సూర్యనారాయణ,వెంకన్న,భానుచందర్,రాందాస్, సుందర్, రమేష్,సుందరం,రమేష్,సి ఆర్ టి రవి, సూరయ్య,కృష్ణకుమారి,భీమ్ రాజు,పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
