Wed. Jan 28th, 2026

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఇఓ కార్యాలయంలో యూనియన్ కోఆర్డినేషన్ సమీక్షా సమావేశం డిఇఓ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో టిఎస్ టిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భానోత్ రాములు నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ చౌహాన్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రాములు నాయక్‌ మాట్లాడుతూ..ప్రస్తుత ప్రమోషన్ ప్రక్రియలో ఏజెన్సీ ప్రాంతానికి భారీ నష్టం జరిగిందని, అడక్వసి లిస్టు తయారీలో లోపాలను సరిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 1996 డీఎస్సీ నుంచి 2024 డీఎస్సీ వరకు జనరల్ రోస్టర్‌లో టాప్ ర్యాంకులతో ఎంపికైన అభ్యర్థులను ఎస్సీ, ఎస్టీ రోస్టర్ గణాంకాలలో చేర్చడం వలన రిజర్వేషన్ క్యాడర్‌ స్ట్రెంత్ పెరిగి, మరింత నష్టం కలుగుతోందని తెలిపారు.ఈ సమస్యను నివారించేందుకు ఎస్టీ రోస్టర్‌లో రెండు రకాల లిస్టులు తయారు చేయాలని ప్రతిపాదించారు. జనరల్ రోస్టర్‌లో ఎంపికైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను రిజర్వేషన్ స్ట్రెంత్‌లో చూపకుండా,కేవలం రిజర్వేషన్ ద్వారా ఎంపికైన వారినే రిజర్వేషన్ క్యాడర్‌ స్ట్రెంత్‌లో నమోదు చేయాలని డిమాండ్ చేశారు.అలాగే గత సంవత్సరం అడక్వసి లిస్టు, సబ్జెక్ట్ వారీగా ప్రమోషన్ పొందిన లిస్టు, కటాఫ్ రోస్టర్ రిజిస్టర్, నాట్ విల్లింగ్ లిస్టు అందజేయాలని కోరారు. రాబోయే ప్రమోషన్ లిస్టులు ఎవరికి అన్యాయం జరగకుండా పరిశీలించి సవరణ చేస్తామని డిఇఓ హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో జిల్లాలోని వివిధ ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

Share this post...