Tue. Feb 3rd, 2026

లక్ష్మిదేవి పల్లి మండలం, హమాలి కాలనీ లో మెయిన్ రోడ్డుపై భారీగా గుంతలు ఏర్పడి ప్రమాదాలు చోటు చేసుకునే పరిస్థితుల్లో ఉండటంతో చాతకొండ నివాసి రావు కిరణ్ తన మానవత్వాన్ని చాటుకున్నాడు.ఆదివారం స్థానిక 6 వ బెటాలియన్ కమాండర్ శివ ప్రసాద్ రెడ్డి చొరవతో వాహనదారులు ఇబ్బందులకు గురౌతున్నారని బెటాలియన్ ప్రాంతంలో గల మట్టిని హమాలి కాలనీ లో గల మెయిన్ రోడ్డు పై ప్రమాదకరంగా మారిన గుంతలను పూడ్చేందుకు అందించారు.బ్లెడ్ ట్రాక్టర్ ద్వారా రోడ్డుపై గల గుంతలను సమానంగా దును చేసి తాత్కాలిక మరమ్మత్తు పనులు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హమాలి కాలనీ సెంటర్ పరిధిలో మెయిన్ రోడ్డు భారీగా గుంతలు ఏర్పడ్డాయని వర్షాకాలంలో గుంతలు వాహనదారులకు అర్థం కాకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని కావున సంబంధిత అధికారులు స్పందించి ఎటువంటి ప్రాణ నష్టం వాటిల్లకుండా కాంక్రీట్ తో గుంతలను పూడ్చాలని కోరారు.

Share this post...