సెప్టెంబర్ 1న హైదరాబాద్ ఇందిరా పార్క్‌లో జరగనున్న సిపిఎస్ రద్దు మహా ధర్నా కార్యక్రమానికి రాష్ట్ర శాఖ పిలుపునిచ్చిన నేపథ్యంలో,పిఆర్‌టియు టీఎస్ ఆధ్వర్యంలో ఈ రోజు అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలకు ప్రాతినిధ్యం చేయాలని ఆదేశాలిచ్చారు.ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావుకు భద్రతలేని సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని విన్నవించాలన్న డిమాండ్‌తో మెమోరాండం అందజేశారు.ఈ కార్యక్రమంలో పిఆర్‌టియు జిల్లా అధ్యక్షులు పూనెం నరసయ్య,మహిళా అసోసియేట్ అధ్యక్షులు కళావతి, లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షులు లక్పతి రాథోడ్,సుజాత నగర్ మండల ప్రధాన కార్యదర్శి శ్రీరాములు,పినపాక మండల ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
