Tue. Feb 3rd, 2026

గిరిజన ఆశ్రమ పాఠశాలల హాస్టల్లో పనిచేస్తున్న డైలీ వేజ్ కాంటింజెంట్ వర్కర్ల సమస్యల పరిష్కారం కొరకై శుక్రవారం పాల్వంచ మండలంలోని పలు ఆశ్రమ పాఠశాల ఎస్ టి హాస్టల్ లలో పని చేస్తున్న డైలీ వేజ్ వర్కర్లు నిరవధిక సమ్మెను మొదలు పెట్టారు.ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. వర్కర్లను పర్మినెంట్ చేయాలి,టైం స్కేల్ పెంచాలనీ..ఇప్పటివరకు జిల్లా కలెక్టర్ గెజిటెడ్ ప్రకారం జీతాలు చెల్లించాలి, మరణించిన వారి స్నానంలో కుటుంబ సభ్యులకు పని కల్పించాలి.పూర్తి కాలం పనిచేస్తున్న వారందరికీ పూర్తి వేతనాలు ఇవ్వాలని,పలు డిమాండ్లతో కూడిన నిరావధిక సమ్మెను చేపట్టినట్లు, మా డిమాండ్లు పరిష్కారం అయ్యేవరకు హాస్టల్లో వంట బంద్ చేస్తున్నామని తెలిపారు.జీఓ 64 తో తమ వేతనం సగానికి సగం తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈజీఓ అమలైతే.. ప్రస్తుతం నెలకు రూ.26వేలు పొందే కార్మికుడి వేతనం.. రూ.11,700కు పడిపోవచ్చని తెలుస్తోంది.ఈ జీఓ అమలు చేయొద్దని,తమ పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మె కు ఎ టి ఈ సి జిల్లా అధ్యక్షులు మాళోత్ బాలు నాయక్ మరియు గిరిజన ఉపాధ్యాయుల రాష్ట్ర నాయకులు రాములు నాయక్ సంఘీభావం మద్దతు తెలిపారు.

Share this post...