Sat. Jan 31st, 2026

భద్రాద్రి జిల్లా కేంద్రంలో జరిగే సేవాలాల్ సేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం విజయవంతం చేయాలని పాల్వంచ మండల అధ్యక్షులు సేవాలాల్ సేన ధర్మ సోత్ పవన్ కళ్యాణ్ నాయక్ పిలుపునిచ్చారు.ఈ మేరకు 2025 సెప్టెంబర్ 9 నుండి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలలో నిర్వహింపచేయాలని నిర్ణయించారని పాల్వంచ మండల అధ్యక్షులు సేవాలాల్ సేన ధర్మ సోత్ పవన్ కళ్యాణ్ నాయక్.ఇందులో భాగంగా భద్రాద్రి జిల్లా కేంద్రం కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ నందు 12వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు సేవాలాల్ సేన ఆవిర్భావ దశాబ్ది జెండా ఆవిష్కరణ కార్యక్రమము జరుగుతుందని.. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు ఆంగోత్ రాంబాబు నాయక్ పాటు రాష్ట్ర కమిటీ ముఖ్య నాయకులు అతిథులుగా పాల్గొంటున్నారని ఆయన అన్నారు.కాబట్టి ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన ఆవిర్భావ ఆశ్యకత,నేపథ్యం, నాటి నుండి నేటి వరకు పోరాడి సాధించిన విజయాలు స్పష్టమైన సందేశం ఇస్తూ బంజారా గిరిజన సమాజాన్ని మేలుకొల్పాలని సందేశం ఇవ్వనున్నారు.సేవాలాల్ సేన కుటుంబ సభ్యులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పవన్ కళ్యాణ్ నాయక్ కోరారు.

Share this post...